ఏపీని బీహార్‌గా మార్చేస్తారా?
ABN , First Publish Date - 2021-10-21T05:20:21+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌ను మరో బీహార్‌గా మార్చేస్తారా అని నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్ అన్నారు.

- నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్
నంద్యాల టౌన్, అక్టోబరు 20: ఆంధ్రప్రదేశ్‌ను మరో బీహార్‌గా మార్చేస్తారా అని నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటోందని ప్రశ్నించారు. విధ్వంసాలు, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, కూల్చివేతలు తప్ప అభివృద్ధి ఎక్కడ అని నిలదీశారు. ప్రశ్నించేవారందరినీ టార్గెట్ చేసుకొని దాడులు చేస్తుండటం దుర్మార్గమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పాలక ప్రభుత్వాలపై ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉందని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అమానుషమని, నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.