మహానంది క్షేత్రం అభివృద్ధికి సహకరిస్తా: ఎంపీ

ABN , First Publish Date - 2021-11-01T05:15:45+05:30 IST

మహానంది క్షేత్రం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి అన్నారు.

మహానంది క్షేత్రం  అభివృద్ధికి సహకరిస్తా: ఎంపీ


మహానంది, అక్టోబరు 31: మహానంది క్షేత్రం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి అన్నారు. ఆదివారం మహానంది క్షేత్రంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో మల్లికార్జునప్రసాద్‌, టెంపుల్‌ ఇనస్పెక్టర్‌ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు ఎంపీని శాల్వతో సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ ఇప్పటికే మహానందిలో భక్తుల వసతి కోసం తాను సొంతంగా రూ.50 లక్షలతో విశ్రాంతి భవనం నిర్మించినట్లు తెలిపారు. వచ్చే కార్తీక మాసంలో భక్తులకు ఉచితంగా వసతి సౌకర్యం కల్పించాలని ఆలయ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మహానంది మీదుగా వ్యవసాయ కళాశాలకు వెళ్లే రహదారిలోని పాలేరు వాగుపై వంతెన నిర్మాణం విషయం తాను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి మహానంది క్షేత్రంలో కోనేర్లలో భక్తులు స్నానాలు చేసుకోవడానికై అనుమతిపై తాను చర్చించుతానన్నారు. మహానందిలోని గోశాలకు పశువుల దానను కేంద్రమంత్రితో మాట్లాడి ప్రత్యేక స్కీం ద్వారా మంజూరు చెయ్యిస్తానని చెప్పారు. వీరివెంట వయోజన విద్యా నేషనల్‌ కమిటీ సభ్యుడు రామలింగారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-11-01T05:15:45+05:30 IST