‘కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి’

ABN , First Publish Date - 2021-10-22T04:30:25+05:30 IST

వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సంఘం నాయకులు లిం గన్న, భాస్కర్‌, విశ్వనాథ్‌ పేర్కొన్నారు. గురువారం పోస్టుకార్డు ఉద్యమంలో భాగంగా సీఎం జగనకు ఉత్తరాలు పంపించి నిరసన వెలిబుచ్చారు.

‘కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి’


ఆత్మకూరు, అక్టోబరు 21: వైద్యఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని  సంఘం నాయకులు లిం గన్న, భాస్కర్‌, విశ్వనాథ్‌ పేర్కొన్నారు. గురువారం పోస్టుకార్డు ఉద్యమంలో భాగంగా సీఎం జగనకు ఉత్తరాలు పంపించి నిరసన వెలిబుచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు  సీఎం జగన అర్హత, సర్వీసులను పరిగణలోకి తీసుకుని కాం ట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తవుతున్న   ఇచ్చిన హామీని విస్మరించడం ఏమిటని ప్రశ్నించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్ట్‌ కార్మికులకు సీఎం జగన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-10-22T04:30:25+05:30 IST