కూలిన అరటి తోట

ABN , First Publish Date - 2021-10-07T05:39:02+05:30 IST

మండలంలోని గోసానిపల్లె గ్రామంలో రైతు శ్రీరాములు అరటితోట కూలిపోయింది.

కూలిన అరటి  తోట
కూలిపోయిన అరటి తోట

డోన్‌, అక్టోబరు 6: మండలంలోని గోసానిపల్లె గ్రామంలో రైతు శ్రీరాములు అరటితోట కూలిపోయింది. మంగళవారం రాత్రి గాలి, వాన భీభత్సవానికి తోటలోని అరటిచెట్లు కూలిపోయాయి.  రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గోసానిపల్లె ఉద్యానవన సహాయకురాలు పుష్ప దెబ్బతిన్న అరటితోటను పరిశీలించారు. నష్టంపై జిల్లా  ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు ఆమె తెలిపారు. 


Updated Date - 2021-10-07T05:39:02+05:30 IST