శివపురంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2021-05-06T05:08:31+05:30 IST
కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఆత్మకూరు/కొత్తపల్లి, మే 5:
కొత్తపల్లి మండలం శివపురం గ్రామంలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ
చోటుచేసుకుంది. పీర్లచావిడి వద్ద ఓ అంశంపై గ్రామస్థులు చర్చిస్తున్నారు. ఈ
నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. అయితే అప్పటికే స్థానిక
సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార పార్టీలోనే నందికొట్కూరు ఎమ్మెల్యే
ఆర్థర్, నియో జకవర్గ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గాల మధ్య
విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాటామాట పెరిగి ఇరువర్గాలు రాళ్లురువ్వుకునే
వరకు చేరింది. ఈ ఘర్షణలో ఇద్దరికి రక్తగాయాలైనట్లు తెలుస్తోంది. ఆత్మకూరు
డీఎస్పీ వై.శృతి, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని
సమీక్షించారు.