లింగాపురంలో ఘర్షణ.. ఏడుగురిపై కేసు

ABN , First Publish Date - 2021-10-19T05:41:42+05:30 IST

మండలంలోని లింగాపురం గ్రామంలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల రూరల్‌ సీఐ రవీంద్ర తెలిపారు.

లింగాపురంలో ఘర్షణ.. ఏడుగురిపై కేసు

బండిఆత్మకూరు, అక్టోబరు 18: మండలంలోని లింగాపురం గ్రామంలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు నంద్యాల రూరల్‌ సీఐ రవీంద్ర తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి మద్యం తాగి అదే గ్రామానికి చెందిన బాబు ఇంటికి వెళ్ళాడన్నారు. తనపై 2017లో నమోదైన అత్యాచార యత్నం కేసు  కేసు విచారణకు వచ్చిందని, దాన్ని ఉపసంహరించుకోవాలని  ఘర్షణ పడి బాబుపై చేయిచేసుకున్నాడన్నారు.  బాబు అనుచరులు అక్కడికి చేరుకోగానే భాస్కర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్ళి పోయాడన్నారు. కాగా  అతడి  ద్విచక్రవాహనానికి బాబు అనుచరులు నిప్పు పెట్టి ఽధ్వంసం చేశారన్నారు. ఈ రెండు వర్గాలకు చెందిన ఏడు గురిపై  కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామని సీఐ తెలిపారు.


Updated Date - 2021-10-19T05:41:42+05:30 IST