శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
ABN , First Publish Date - 2021-05-24T05:38:05+05:30 IST
ఆలూరు పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సీఐ ఈశ్వరయ్య అన్నారు.

చిప్పగిరి, మే 23: ఆలూరు పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సీఐ ఈశ్వరయ్య అన్నారు. ఆలూరు సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా చిప్పగిరి పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సతీష్‌కుమార్, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, పోలీసులతో సమావేశమై మండలంలోని ఆయా గ్రామాల్లోని పరిస్థితులను సమీక్షించి, రికార్డులను తనిఖీలు నిర్వహించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య లేకుండా శాంతియుత వాతావరణం నెలకొనేలా చూస్తామన్నారు. అనంతరం చిప్పగిరి ఎస్సీ కాలనీలో పోలీస్ పికెటింగ్‌ను పరిశీలించారు. ప్రజల ఫిర్యాదు మేరకు గ్రామంలో వచ్చే మురుగునీరు నిల్వ ఉన్న నీటిగుంతను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన సర్పంచ్ దాసరి గోవిందరాజులు, ఎంఆర్‌పీఎస్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు లక్ష్మీనారాయణకు సీఐ హామీ ఇచ్చారు. ఎస్‌ఐ సతీష్‌కుమార్, ఏఎస్‌ఐలు నరసింహారెడ్డి, నజీర్‌అహ్మద్, ఖాదర్‌బాషా పాల్గొన్నారు.