దేవదాయశాఖ పరిధిలోకి చౌడేశ్వరి ఆలయం

ABN , First Publish Date - 2021-06-22T05:38:34+05:30 IST

పట్టణంలోని చౌడేశ్వరీ దేవి ఆలయాన్ని దేవదాయశాఖ తన పరిధిలోకి తీసుకుందని నందికొట్కూరు గ్రూప్‌ టెంపుల్స్‌ ఈవో నాగప్రసాద్‌ తెలిపారు.

దేవదాయశాఖ పరిధిలోకి చౌడేశ్వరి ఆలయం

నందికొట్కూరు, జూన్‌ 21: పట్టణంలోని చౌడేశ్వరీ దేవి ఆలయాన్ని దేవదాయశాఖ తన పరిధిలోకి తీసుకుందని నందికొట్కూరు గ్రూప్‌ టెంపుల్స్‌ ఈవో నాగప్రసాద్‌ తెలిపారు. చౌడేశ్వరీదేవి ఆలయం ప్రసిడెంట్‌ ప్రసాద్‌, కార్యదర్శి మురళి ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని ఉత్తరం రాయడంతో సోమవారం ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆలయానికి సంబంధించిన రికార్డులను ఈవోకు ఆలయ చైర్మన్‌ అందజేశారు. Updated Date - 2021-06-22T05:38:34+05:30 IST