ఆలయాల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే
ABN , First Publish Date - 2021-01-20T05:35:08+05:30 IST
దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి అన్నారు.

- చినజీయర్ స్వామి
ఆళ్లగడ్డ, జనవరి 19: దేవాలయాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న నేపథ్యంలో వాటి పరిరక్షణ నిమిత్తం చేస్తున్న పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం చినజీయర్ స్వామి మంగళవారం సాయంత్రం ఆళ్లగడ్డకు వచ్చారు. పట్టణంలోని అమ్మవారి శాలను చేరుకొని హిందూ సమ్మేళన కార్యక్రమంలో ప్రసంగిం చారు. ప్రజలు వారి మతానికి సంబంధించిన దేవుళ్లను ఆరాదించాలని, ప్రజలందరిని ఆదరించాలని ఆయన సూచిం చారు. కులమతాలపై రాజకీయాలు చేయడం సరికాద న్నారు. ప్రతి మనిషి ప్రేమానురాగాలతో ముందుకు పోవాలే తప్ప ఈర్ష్య, ద్వేషాలతో జీవించవద్దని సూచించారు. ఆ తరువాత ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం మండలంలోని చిన్నకందుకూరు గ్రామంలో వెలసిన కాళబైరవస్వామి ఇటీవల దాడికి గురి కావడంతో గ్రామస్థులను అడిగి వివకాలె తెలుసుకున్నారు. భక్తునికి కాళబైరవుడిపై నమ్మకం పెరిగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చినజీయర్ స్వామి అన్నారు. స్వామీజీ మాట్లాడుతూ హిందూ దేవాలయాలు ప్రాచీన నాగరికతకు చిహ్నలని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. దాడులు చేసిన వారిని గుర్తించేందుకు సత్తా ఉన్న మన పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన సూచించారు.
ఉత్సవ పల్లకికి పూజలు
మండలంలోని కోటకందుకూరులో పర్యటిస్తున్న అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ పల్లకికి చినజీయర్‌స్వామి, ఎమ్మెల్సీ గంగుల ప్రభారకరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పూజలు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు.