ఆ భూములను వైద్య కళాశాలకు కేటాయించొద్దు

ABN , First Publish Date - 2021-05-09T05:22:17+05:30 IST

రాష్ట్రంలోని నంద్యాల, మచిలీపట్నం, అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేటాయించవద్దని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.

ఆ భూములను వైద్య కళాశాలకు కేటాయించొద్దు

  1. సీఎంకు బొజ్జా దశరథరామిరెడ్డి బహిరంగ లేఖ


నంద్యాల(ఎడ్యుకేషన్‌), మే 8: రాష్ట్రంలోని నంద్యాల, మచిలీపట్నం, అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేటాయించవద్దని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ పంపారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములను వైద్య కళాశాల ఏర్పాటుకు బదలాయింపుతో వ్యవసాయ పరిశోధనా మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయవద్దని అన్నారు. ఆయా ప్రాంతాలలో కోల్పోయిన వ్యవసాయ పరిశోధనా మౌలిక వసతులు ఇంకో ప్రాంతంలో అభివృద్ధి చేయడం అత్యంత ఖర్చుతో కూడినదిగా కాకుండా పరిశోధనల్లో అంతరాయం వల్ల జరిగే నష్టం, కొత్త మౌళిక వసతుల ఏర్పాటుకు కూడా చాలా సంవత్సరాలతో కూడిన వ్యవహారం కావడంతో పరిశోధనలకు జరిగే జాప్యం, తదితర అంశాలతో వ్యవసాయ రంగానికి తీవ్రనష్టాలు సంభవిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై మంత్రులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, బోర్డు సభ్యులు, ఏపీ రాష్ట్ర అగ్రికల్చరల్‌ మిషన్‌ వైస్‌చైర్మన్‌, సభ్యులు, రెవెన్యూ అధికారులకు విజ్ఞాపణలు చేసినా సీఎం వరకు అవి చేరలేదని భావిస్తుండటంతో అనేక అంశాలతో బహిరంగ లేఖను పంపినట్లు ఆయన చెప్పారు. 

Updated Date - 2021-05-09T05:22:17+05:30 IST