మోడల్‌ స్కూల్‌ తనిఖీ

ABN , First Publish Date - 2021-10-26T05:20:21+05:30 IST

గోనెగండ్ల మోడల్‌ స్కూల్‌ను సోమవారం మోడల్‌ స్కూల్‌ సెక్రటరీ రవీంద్రనాఽథ్‌రెడ్డి, కర్నూలు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మోడల్‌ స్కూల్‌ తనిఖీ

గోనెగండ్ల, అక్టోబరు 25: గోనెగండ్ల మోడల్‌ స్కూల్‌ను సోమవారం మోడల్‌ స్కూల్‌ సెక్రటరీ రవీంద్రనాఽథ్‌రెడ్డి, కర్నూలు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడారు. విద్యాబోధన ఎలా సాగుతున్నదని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నన భోజనం  రుచి చూశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T05:20:21+05:30 IST