బాలికల వసతి గృహం తనిఖీ
ABN , First Publish Date - 2021-10-30T04:07:09+05:30 IST
పాములపాడులోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని డిప్యూటీ డైరెక్టర్ ప్రతాప్ సూర్యనారాయణరెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
పాములపాడు అక్టోబరు 29: పాములపాడులోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని డిప్యూటీ డైరెక్టర్ ప్రతాప్ సూర్యనారాయణరెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలోని వంట సరుకుల నిల్వలను,మినరల్ వాటర్ ప్లాంట్ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో నెలకొన్న మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఉన్నతాధికారులకు నివేదించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వసతి గృహం వార్డెన ఉమాదేవి పాల్గొన్నారు.
ఆత్మకూరు: వెంకటాపురం గ్రామంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సాంఘీక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పీస్‌ఎన రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని గదులు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను, హాస్టల్ రికార్డులను హాస్టల్‌లో 100 మంది విద్యార్థులకు కల్పించవచ్చునని, వసతిగృహంలో నిర్ధేశించిన సంఖ్యలో విద్యార్థులు వచ్చేలా చొ రవ తీసుకోవాలని వార్డెన అంకన్నకు ఆదేశించారు. కాగా హాస్టల్‌కు కాంపౌండ్ వా ల్ లేదని గుర్తించి త్వరలోనే నాడు-నేడు కింద మంజూరు చేస్తానని పేర్కొన్నారు.
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల గురుకుల పాఠశాలను ఎస్సీ కార్పొరేషన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల ఆవరణాన్ని, తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో వీఆర్వో చెన్నయ్య, మాస్టర్ ట్రైనర్ శివ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, పీఆర్‌పీ చౌడప్ప పాల్గొన్నారు.