శ్రీశైలం ఆలయ వేళల్లో మార్పులు

ABN , First Publish Date - 2021-12-30T05:59:48+05:30 IST

శ్రీశైలంలో జనవరి 1వ తేదీన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ వేళల్లో మార్పు చేశారు.

శ్రీశైలం ఆలయ వేళల్లో మార్పులు

  1. స్పర్శ దర్శనం తాత్కాలిక నిలుపుదల
  2. జనవరి 1న భక్తుల రద్దీ నేపథ్యంలో..


శ్రీశైలం, డిసెంబరు 29: శ్రీశైలంలో జనవరి 1వ తేదీన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ వేళల్లో మార్పు చేశారు. శనివారం ఆలయ ద్వారాలు 3 గంటలకు తెరిచి సుప్రభాతం, మహామంగళహారతి అనంతరం 4 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. అలాగే స్వామి స్పర్శ దర్శనం నిలుపుదల చేసి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేశారు. సామూహిక అభిషేక సేవాకర్తలకు, విరామ దర్శన టికెట్‌ పొందిన భక్తులకు కూడా అలంకార దర్శనమే ఉంటుందని అధికారులు తెలిపారు. దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. దర్శనం ప్రారంభమైనప్పటి నుంచి ఆలయ ద్వారాలు మూసేవరకు లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకొన్నారు. 

Updated Date - 2021-12-30T05:59:48+05:30 IST