శ్రీశైలం ఆలయ వేళల్లో మార్పులు

ABN , First Publish Date - 2021-12-26T05:51:21+05:30 IST

శ్రీశైలంలో జనవరి 1 వ తేదీ మార్గశిర మాసశివరాత్రి రోజును పురస్కరించకొని ఆలయ వేళల్లో మార్పులు చేశారు.

శ్రీశైలం ఆలయ వేళల్లో మార్పులు

 శ్రీశైలం,  డిసెంబరు 25: శ్రీశైలంలో జనవరి 1 వ తేదీ మార్గశిర మాసశివరాత్రి రోజును పురస్కరించకొని ఆలయ వేళల్లో మార్పులు చేశారు. శనివారం కార్యనిర్వహణాధికారి ఎస్‌.లవన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జనవరి 1 న ఆలయ ద్వారాలు 3 గంటలకు తెరచి పూజాధికాలు నిర్వహణ అనంతరం ఉదయం 4 నుంచి మద్యహ్నం 3.30 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కల్పించనున్నారు. కాగా భక్తుల రద్ధీ దృష్య్టా భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు స్వామివారి స్పర్శ దర్శనం నిలుపుదల చేసి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు. అదేవిధంగా గర్ఛాలయ అభిషేకాలు నిలుపుదల చేస్తూ, సామూహిక అభిషేకసేవాకర్తలకు, విరామ దర్శన టికెట్‌ పొందిన భక్తులకు కూడా స్వామివారి అలంకార దర్శనం కల్పించనున్నారు. 


Updated Date - 2021-12-26T05:51:21+05:30 IST