మహానంది దర్శనం వేళల్లో మార్పు

ABN , First Publish Date - 2021-05-05T06:05:46+05:30 IST

మహానందిలో బుధవారం నుంచి ఉదయం మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుందని ఈవో మల్లికార్జున ప్రసాద్‌ తెలిపారు.

మహానంది దర్శనం వేళల్లో మార్పు


మహానంది, మే 4:
మహానందిలో బుధవారం నుంచి ఉదయం మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుందని ఈవో మల్లికార్జున ప్రసాద్‌ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11.30 వరకు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మహానందీశ్వరుడిని దర్శించుకోవాలన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయం తలుపులు మూసివేస్తామన్నారు. రాత్రి 7 గంటల నుంచి 7.30 వరకు ప్రధాన ఆలయాల్లో అర్చకులు మహానివేదన నిర్వహించి ఆలయం తలుపులు మూసివేస్తారని తెలిపారు. నిత్యం జరిగే సేవలను ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2021-05-05T06:05:46+05:30 IST