మల్లన్న సన్నిధిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి
ABN , First Publish Date - 2021-12-30T05:54:57+05:30 IST
శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను బుధవారం సాయంత్రం కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా దర్శించుకొన్నారు.

శ్రీశైలం, డిసెంబరు 29: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను బుధవారం సాయంత్రం కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా దర్శించుకొన్నారు. ఆయనకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం నాగేంద్రనాథ్ సిన్హా స్వామివారికి అభికం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో దేవస్థానం కార్య నిర్వ హణాధికారి లవన్న, వేదపండితులు ఆయనకు తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలను, స్వామి అమ్మవార్ల జ్ఙాపికను అందజేశారు. అదే విధంగా ఉదయం కలెక్టరు కోటేశ్వరరావు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీశైలం పర్యటనకు విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హాను భ్రమరాంబ సదనం అతిఽథి గృహం వద్ద కలెక్టర్ పి.కోటేశ్వరరావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్ర మంలో జాయింట్ కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కర్నూలు ఆర్‌డీవో హరిప్రసాద్, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశులు, డ్వామా పీడీ అమ ర్నాథరెడ్డి, డీపీవో ప్రభాకర్ రావు పాల్గొన్నారు.