ప్రశ్నిస్తే కేసులా?: గౌరు దంపతులు

ABN , First Publish Date - 2021-10-21T05:17:36+05:30 IST

ప్రభుత్వ చర్యలపై ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే హక్కు తమకు ఉందని, ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశ్నిస్తే కేసులా?: గౌరు దంపతులు
తమ నివాసం నుంచి ర్యాలీగా వెళ్తున్న గౌరు దంపతులు, టీడీపీ నాయకులు


కల్లూరు, అక్టోబరు 20: ప్రభుత్వ చర్యలపై ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే హక్కు తమకు ఉందని, ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బంద్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న గౌరు దంపతులను, టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఉదయాన్నే మాధవీనగర్‌లోని గౌరు నివాసానికి చేరుకుని హౌస్‌ అరెస్టు చేశారు. దీనిపై గౌరు దంపతులు అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. అనంతరం గౌరు నివాసం నుంచి అమ్మా హాస్పిటల్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో నంద్యాల లోక్‌సభ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, పాణ్యం తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్‌గౌడు, పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, కల్లూరు మండల అధ్యక్షులు రామాంజినేయులు, కల్లూరు, ఓర్వకల్లు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T05:17:36+05:30 IST