నిబంధనలు ఉల్లంఘించిన సర్పంచ్‌పై కేసు
ABN , First Publish Date - 2021-05-21T05:44:44+05:30 IST
మహానంది మండలం గాజులపల్లి ఆర్‌ఎస్ గ్రామ సర్పంచ్ అస్లాంబాషాతోపాటు మరో ఆరుగురిపై కర్ప్యూ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గురువారం రాత్రి తెలిపారు.

- ఎన్టీఆర్ జన్మదినం వేడుకలను నిర్వహించిన అస్లాంబాషా
మహానంది, మే 20: మహానంది మండలం గాజులపల్లి ఆర్‌ఎస్ గ్రామ సర్పంచ్ అస్లాంబాషాతోపాటు మరో ఆరుగురిపై కర్ప్యూ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గురువారం రాత్రి తెలిపారు. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను గాజులపల్లి ఆర్‌ఎ్‌సలో గ్రామ సర్పంచ్ అస్లాంబాషా ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించారు. నిబం ధనలకు విరుద్ధంగా 20 మందితో కలసి మాస్కు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా నిర్వహించిన ఈ కార్యక్రమం వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసాయని ఆయన తెలి పారు. అందువల్ల సర్పంచ్‌తోపాటు మరో ఆరుగురిపై రెండు సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.