‘భర్త, అత్త, మామపై కేసు నమోదు’
ABN , First Publish Date - 2021-04-01T06:15:02+05:30 IST
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని షేక్ మల్లిక ఫిర్యాదు మేరకు భర్త అలీఅక్బర్, అత్తమామలు జాన్, గౌస్ మొహిద్దీన్, బావ ఖాదర్‌హుస్సేన్‌లపై కేసు నమోదు చేసినట్లు బేతంచెర్ల సీఐ పీటీ కేశవరెడ్డి బుధవారం తెలిపారు.
బేతంచెర్ల, మార్చి 31: అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని షేక్ మల్లిక ఫిర్యాదు మేరకు భర్త అలీఅక్బర్, అత్తమామలు జాన్, గౌస్ మొహిద్దీన్, బావ ఖాదర్‌హుస్సేన్‌లపై కేసు నమోదు చేసినట్లు బేతంచెర్ల సీఐ పీటీ కేశవరెడ్డి బుధవారం తెలిపారు. వివరాల మేరకు.. 2017లో కర్నూలుకు చెందిన అలీఅక్బర్‌తో మల్లికకు వివాహం కాగా, రూ.లక్ష కట్నం ఇచ్చారని, మరో రూ.లక్ష తీసుకురావాలంటూ వేధిస్తున్నారని బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.