‘ముస్లింల సమస్యల పరిష్కారానికే బస్సు యాత్ర’

ABN , First Publish Date - 2021-08-21T05:20:18+05:30 IST

ముస్లింల సమస్యల పరిష్కారానికే బస్సు యాత్ర నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామని ముస్లిం ఫెడరేషన్‌ ఏపీ కన్వీనర్‌ దస్తగిరి, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్‌ మహబూబ్‌బాషా అన్నారు.

‘ముస్లింల సమస్యల పరిష్కారానికే బస్సు యాత్ర’

నంద్యాల టౌన్‌, ఆగస్టు 20: ముస్లింల సమస్యల పరిష్కారానికే బస్సు యాత్ర నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామని ముస్లిం ఫెడరేషన్‌ ఏపీ కన్వీనర్‌ దస్తగిరి, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్‌ మహబూబ్‌బాషా అన్నారు. శుక్రవారం ఫెడరేషన్‌ యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్‌ సుహైల్‌రాణా అధ్యక్షతన బస్సు యాత్ర కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింల రక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ తరహాలో ప్రత్యేకంగా ముస్లిం చట్టాలను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ముస్లిం సామాజిక వర్గానికి దామాషా పద్ధతిలో జస్టిస్‌ రంగనాథ మిశ్రా కమిషన్‌, జస్టిస్‌ రాజేంద్ర సచార్‌ కమిషన్‌ నివేదికల ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో కేటాయింపులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని ముస్లింలకు దుల్హన్‌ లాంటి సంక్షేమ పథకాలను త్వరితగతిన అందేలా దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆవాజ్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ మస్తాన్‌వలి, పీడీఎ్‌సయూ, ముస్లింలీగ్‌, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి, ముస్లిం హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-21T05:20:18+05:30 IST