‘భవనాలు సౌకర్యవంతంగా ఉండాలి’

ABN , First Publish Date - 2021-10-30T04:43:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌, లోకాయుక్త సంస్థ కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనం సౌకర్యంగా ఉండాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు భవన యజమానులకు సూచించారు.

‘భవనాలు సౌకర్యవంతంగా ఉండాలి’

కర్నూలు(కలెక్టరేట్‌), అక్టోబరు 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌, లోకాయుక్త సంస్థ కార్యాలయాల కోసం నిర్మిస్తున్న భవనం సౌకర్యంగా ఉండాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు భవన యజమానులకు సూచించారు. బళ్లారి చౌరస్తా డీమార్టు వెనుక రాగమయూరి ప్రైడ్‌లో నిర్మిస్తున్న ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయం, కర్నూలు-హైదరాబాదు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సంతోష్‌నగర్‌లో నిర్మిస్తున్న  లోకాయుక్త సంస్థ కార్యాలయం భవన నిర్మాణాల పురోగతిని కలెక్టర్‌ శుక్రవారం పరిశీలించారు.  త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్‌ రెడ్డిని, భవన యజమానులను ఆయన ఆదేశించారు. 

Updated Date - 2021-10-30T04:43:07+05:30 IST