బ్రాహ్మణదొడ్డి ఉపసర్పంచ్‌ మృతి

ABN , First Publish Date - 2021-12-31T05:06:05+05:30 IST

మండలంలోని బ్రాహ్మణదొడ్డి గ్రామ ఉపసర్పంచ్‌ బోయ పెద్దమద్దిలేటి (71) గురువారం మృతి చెందాడు.

బ్రాహ్మణదొడ్డి ఉపసర్పంచ్‌ మృతి


సి.బెళగల్‌, డిసెంబరు 30: మండలంలోని బ్రాహ్మణదొడ్డి గ్రామ ఉపసర్పంచ్‌ బోయ పెద్దమద్దిలేటి (71) గురువారం మృతి చెందాడు. గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తై ఉన్నారు. కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, మండల నాయకులు గంపరాజు వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్‌ తిమ్మప్ప ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కోడుమూరు ఎమ్మెల్యే వెంట గూడూరు వైస్‌చైర్మన్‌ అస్లాం, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-31T05:06:05+05:30 IST