నూతన సంవత్సర వేడుకలను బహిష్కరించండి

ABN , First Publish Date - 2021-12-31T05:51:16+05:30 IST

పీఆర్సీ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నూతన సంవత్సరం వేడుకలను బహిష్కరించాలని ఏపీజేఏసీ, ఏపీఎన్జీవో నాయకులు గురువారం ఓ పత్రికా ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.

నూతన సంవత్సర వేడుకలను బహిష్కరించండి

  1. ఏపీజేఏసీ, ఏపీఎన్జీవో నాయకుల పిలుపు


కర్నూలు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పీఆర్సీ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నూతన సంవత్సరం వేడుకలను బహిష్కరించాలని ఏపీజేఏసీ, ఏపీఎన్జీవో నాయకులు గురువారం ఓ పత్రికా ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం పదేపదే మీటింగులంటూ కాలయాపన చేస్తోందన్నారు. దీనికి నిరసనగా నూతన సంవత్సర వేడుకలను బహిష్కరిస్తున్నామని, దీనికి ఉద్యోగులందరూ సహకరించాలని ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌ వీసీహెచ్‌ వెంగళరెడ్డి, ఏపీఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి వి.జవహర్‌లాల్‌, ఏపీఎన్జీవో నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎంసీ కాశన్న, పాండురంగారెడ్డి కోరారు. 


Updated Date - 2021-12-31T05:51:16+05:30 IST