ట్రాక్టర్‌ ఢీకొని బాలుడికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-07-09T05:23:16+05:30 IST

పత్తికొండ పట్టణంలోని వాసవీకళ్యాణమండపం సమీపంలో గురువారం సాయంత్రం ట్రాక్టర్‌ ఢీకొనడంతో మూడేళ్ల బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.

ట్రాక్టర్‌ ఢీకొని బాలుడికి తీవ్రగాయాలు

పత్తికొండ, జూలై 8: పత్తికొండ పట్టణంలోని వాసవీకళ్యాణమండపం సమీపంలో గురువారం సాయంత్రం ట్రాక్టర్‌ ఢీకొనడంతో మూడేళ్ల బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.  బాలుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడి నుంచి చికిత్సనిమిత్తం కర్నూలుకు తరలించారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిని వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొందని స్థానికులు తెలిపారు. పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2021-07-09T05:23:16+05:30 IST