సీబీఐ దర్యాప్తు చేయించాలి

ABN , First Publish Date - 2021-01-13T05:46:17+05:30 IST

రామళ్లకోట రోడ్డులో ఉన్న బాలయోగి ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్‌ విద్యార్థిని పుష్పలత (16) మృతిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని బీజేపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

సీబీఐ దర్యాప్తు చేయించాలి

  1.  బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి 


బేతంచెర్ల, జనవరి 12: రామళ్లకోట రోడ్డులో ఉన్న బాలయోగి ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్‌ విద్యార్థిని పుష్పలత (16) మృతిపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని బీజేపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బేతంచెర్ల దుర్గాపేటలో పుష్పలత తల్లిదండ్రులు ఆనందరావు, మమతను ఆయన  మంగళవారం పరామర్శించారు. గతంలో కూడా ఇదే హాస్టల్‌లో ఓ విద్యార్థిని ఉరి వేసుకుందని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఈ ఘటనలకు కారణాలు ఏమిటో తేల్చాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థిని మృతదేహానికి రీపోస్టుమార్టం చేయించాలని కోరారు. ఆయన వెంట డోన్‌, ప్యాపిలి బీజేపీ అధ్యక్షులు హేమసుందర్‌రెడ్డి, వడ్డె మహరాజు, జిల్లా కార్యకర్తలు రామయ్య, లక్ష్మిరెడ్డి, రాఘవేంద్ర, మద్దిలేటి ఉన్నారు. 


చర్యలు తీసుకోవాలి: దండు వీరయ్య మాదిగ 

పుష్పలత మృతిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థిని కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాలుకా రాజయ్య, గౌరవాధ్యక్షుడు మద్దిలేటి మాదిగ, జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, మండలాధ్యక్షుడు శేఖర్‌ తదితరులు ఆయన వెంట ఉన్నారు. 

 పుష్పలత మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిటీ ఇన్‌చార్జి, ఆత్మకూరు డీఎస్పీ శృతి, దిశ పోలీ్‌సస్టేషన్‌ డీఎస్పీ వెంకటరామన్‌ తెలిపారు.  

Updated Date - 2021-01-13T05:46:17+05:30 IST