హుండీ లెక్కింపు ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-30T04:44:18+05:30 IST
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం అక్టోబరుకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కింపు ప్రారంభించా రు.

మంత్రాలయం, అక్టోబరు 29: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం అక్టోబరుకు సంబంధించిన హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కింపు ప్రారంభించా రు. మఠం మేనేజర్ వెంకటేష్‌జోషి ఆధ్వర్యంలో భ్రమరాంబ టీం, శారద గ్రూప్, కర్నూలు, బళ్లారికి చెందిన భక్తులు మొదటి రోజు హుండీని లెక్కింపు చేపట్టారు. మొదటి రోజు లెక్కింపు పూర్తయ్యేసరికి రూ.1.83కోట్లు ఆదాయం వచ్చిందని మఠం మేనేజర్ తెలిపారు. శనివారం కూడా హుండీ లెక్కింపు సాగుతుందని, బంగారు, వెండిని లెక్కించాల్సి ఉందని ఆయన తెలిపారు.