‘బేస్‌మెంట్‌ పనులు అయిపోవాలి’

ABN , First Publish Date - 2021-09-03T05:12:38+05:30 IST

సెప్టెంబరు 20న గ్రామానికి మరోసారి వస్తానని, అప్పటికల్లా బేస్‌మెంట్‌ లెవల్‌ వరకూ ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలని హౌసింగ్‌ జేసీ నారపురెడ్డి మౌర్య సిబ్బందిని ఆదేశించారు.

‘బేస్‌మెంట్‌ పనులు అయిపోవాలి’

ఆదోని రూరల్‌, సెప్టెంబరు 2: సెప్టెంబరు 20న గ్రామానికి మరోసారి వస్తానని, అప్పటికల్లా బేస్‌మెంట్‌ లెవల్‌ వరకూ ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలని  హౌసింగ్‌ జేసీ నారపురెడ్డి మౌర్య సిబ్బందిని ఆదేశించారు.  గురువారం ఢనాపురం, ఆరేకల్లు, పెద్దపెండేకల్లు గ్రామం లో మండల స్థాయి అధికారులతో కలిసి   జగనన్న కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్ధిదారులను ఒప్పించి ఇండ్లు  కట్టించాలని అధికారులకు ఆదేశించారు.   నీటి సమస్య, ఆర్థిక ఇబ్బందుల వల్ల  సకాలంలో ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నామని లబ్ధిదారులు జేసీకి తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించి,  బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించాలని  అధికారులను ఆయన ఆదేశించారు. 

Updated Date - 2021-09-03T05:12:38+05:30 IST