అరటి ధర పతనం

ABN , First Publish Date - 2021-12-15T05:35:36+05:30 IST

అరటికి ధర లేక రైతులు దిగాలు చెందుతున్నారు.

అరటి ధర పతనం
చిన్నవంగలిలో అరటి తోటను దున్నెస్తున్న రైతు

  1. తోటలను దున్నేస్తున్న వైనం 


చాగలమర్రి, డిసెంబరు 14: అరటికి ధర లేక రైతులు దిగాలు చెందుతున్నారు. పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నారు.  మంగళవారం చిన్నవంగలి గ్రామంలో అరటిపై ఆశలు వదులుకొని  చంద్ర ఓబుళరెడ్డి అనే రైతు మూడు ఎకరాల అరటి తోటను తొలగించేశాడు. గత ఏడాది టన్ను అరటి రూ.18 వేలు ధర పలికిందని, ఈ ఏడాది టన్ను రూ.1,500 కూడా పలకడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాలకు  వైరస్‌ సోకి  తోటలు దెబ్బతిన్నాయన్నారు.  

Updated Date - 2021-12-15T05:35:36+05:30 IST