కొనుగోలు చేసేవారు లేక..
ABN , First Publish Date - 2021-10-29T05:15:00+05:30 IST
మండలంలోని ఆలమూరు గ్రామంలో అరటితోటలు, అరటి గెలలను కొనుగోలు చేసేవారు ఎవరూ రాకపోవడంతో గురువారం రైతులు తోటలను డోజర్‌తో దున్నేశారు.

- డోజర్ తో అరటి తోట తొలగింపు
రుద్రవరం, అక్టోబరు 28: మండలంలోని ఆలమూరు గ్రామంలో అరటితోటలు, అరటి గెలలను కొనుగోలు చేసేవారు ఎవరూ రాకపోవడంతో గురువారం రైతులు తోటలను డోజర్‌తో దున్నేశారు. గరుడయ్య, రమణయ్య అనే రైతులు 5 ఎకరాల్లో అరటి తోటను డోజర్‌తో దున్నెశారు. లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిలో రూ.5 కూడా ధర లేకపోవడంతో పంటను దున్నేశామని అన్నారు.