వివాహ వయసు పెంపుపై అవగాహన యాత్ర

ABN , First Publish Date - 2021-12-29T05:15:22+05:30 IST

మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ చేసిన చట్టానికి మద్దతుగా లీగల్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి రాజలక్ష్మి మందా ఢిల్లీ నుంచి కేరళ వరకు చేపట్టిన ర్యాలీ మంగళవారం కర్నూలు చేరుకుంది.

వివాహ వయసు పెంపుపై అవగాహన యాత్ర

కర్నూలు(ఎడ్యుకేషన), డిసెంబరు 28: మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ చేసిన చట్టానికి మద్దతుగా లీగల్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఇండియా ప్రధాన కార్యదర్శి రాజలక్ష్మి మందా ఢిల్లీ నుంచి కేరళ వరకు చేపట్టిన ర్యాలీ మంగళవారం కర్నూలు  చేరుకుంది. వీరికి జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. బైరెడ్డి కన్వెన్షన హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజలక్ష్మి మందా మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన చట్టం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో లీగల్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఇండియా అధ్యక్షుడు మదనకుమార్‌ గూరుజి, జాతీయ కార్యదర్శి రామ్‌ చంద్రారెడ్డి, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు చింతలపల్లి రామక్రిష్ణ, జాయింట్‌ సెక్రటరీ కౌసల్య, రిటైర్డు ప్రిన్సిపల్‌ కొట్టె చెన్నయ్య, రాయలసీమ విద్యార్థి జేఏసీ చైర్మన కోనేటీ వెంకటేశ్వర్లు, ఏపీ విద్యార్థి సంగం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-29T05:15:22+05:30 IST