‘భూ సమగ్ర సర్వేపై అవగాహన కల్పించాలి’
ABN , First Publish Date - 2021-10-30T04:47:40+05:30 IST
ప్రభుత ్వం చేపట్టిన భూ సమగ్ర సర్వేపై ఆయా గ్రామ రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మన్‌జీర్ జిలనీ సమూన్ అన్నారు.
గోనెగండ్ల, అక్టోబరు 29: ప్రభుత ్వం చేపట్టిన భూ సమగ్ర సర్వేపై ఆయా గ్రామ రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మన్‌జీర్ జిలనీ సమూన్ అన్నారు. శుక్రవారం గాజులదిన్నె గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో భూ సర్వే పనులు ఏలా జరుగుతున్నాయని మండల సర్వేయర్‌లను అడిగి తెలుసుకున్నారు. అలాగే సచివాలయం, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించా రు. ఎస్సీ కాలనీలో తాగునీటి ట్యాంక్ దగ్గర అపరిశుభ్రత ఉండటంతో పంచాయతీ కార్యదర్శిని పిలిచి శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, డీఎల్‌పీవో నూర్జమన్ పాల్గొన్నారు.