కరోనా నివారణపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-05-02T06:02:04+05:30 IST

గ్రామాల్లో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి అధికారులను ఆదేశించారు.

కరోనా నివారణపై అవగాహన కల్పించాలి
ఈశ్వర్‌నగర్‌ కాలనీలో పర్యటిస్తున్న సబ్‌ కలెక్టర్‌

  1. నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి


మహానంది,  మే 1: గ్రామాల్లో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి అధికారులను ఆదేశించారు. శనివారం మహానంది సమీపంలోని ఈశ్వర్‌నగర్‌ కాలనీలో ఆమె గ్రామస్థాయి బృందంతో కలిసి పర్యటించారు. అనం తరం ఆమె మహానంది సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో ఇప్పటి వరకు ఎంతమందికి వాక్సినేషన్లు వేశారు, ఇంకా ఎంతమందికి వ్యాక్సిన్‌ వేయ్యాల్సి ఉందని సచివాలయం ఆడ్మి న్‌ను అడిగి తెలుసుకొన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరిం చాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. అంతకుముందు మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో కరోనా కట్టడిపై టీమ్‌లు ఏవి ధంగా పనిచేస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌  నారాయణరెడ్డి, తిమ్మాపురం ప్రాఽథ మిక ఆరోగ్య కేంద్రం వైధ్యాధికారులు చంద్రశేఖర్‌, లింగన్న, ఎంపీహె చ్‌ఈవో ఉసే న్‌రెడ్డి,  వీఆర్వో శివప్రసాద్‌ యాదవ్‌, తమ్మడపల్లి పంచాయతీ కార్యదర్శి కలువ భాస్కర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-02T06:02:04+05:30 IST