ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2021-06-21T05:48:59+05:30 IST

మండలంలోని తాటిపాడు అంచెవద్ద కేజీ రోడ్డుపై ఆదివారం ప్రమాదవశాత్తు నీళ్లఆటో బోల్తాపడిన సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

జూపాడుబంగ్లా, జూన్‌ 20: మండలంలోని తాటిపాడు అంచెవద్ద కేజీ రోడ్డుపై ఆదివారం ప్రమాదవశాత్తు నీళ్లఆటో బోల్తాపడిన సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. తాటిపాడు గ్రామానికి చెందిన నీళ్లఆటో జూపాడుబంగ్లాకు వస్తుండగా మలుపువద్ద కంట్రోల్‌కాకపోవడంతో ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడింది. అందు లో ఉన్న కుళాయి, చిన్న, డ్రైవర్‌ అనీల్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కుళాయి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. క్షతగాత్రులను 108లో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు.Updated Date - 2021-06-21T05:48:59+05:30 IST