ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-08-28T05:12:23+05:30 IST

ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడి ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటన మండల పరిధిలోని జుమాలదిన్నె గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.

ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు

కోసిగి, ఆగస్టు 27: ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడి ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటన మండల పరిధిలోని జుమాలదిన్నె గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనాంతరం కోసిగి, చిర్తనకల్‌, గంజిహల్లి గ్రామాలకు చెందిన భక్తులు ఆటోలో వస్తుండగా ఆటో పంక్చర్‌ అయింది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో పక్కనే ఉన్న పొలాల్లోకి ఆటో దూసుకెళ్లి ఒక్కసారిగా బోల్తా పడిందని ప్రయాణికులు, డ్రైవర్‌ తెలిపారు. ఈ ప్రమాదంలో నాగరాజు, మూకమ్మ, నరసింహులు, అయ్యమ్మ, చిలకమ్మ, నరసప్పతోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని రైతులు చికిత్స నిమిత్తం వీరిని కోసిగి పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-08-28T05:12:23+05:30 IST