అదుపుతప్పి ఆటో బోల్తా

ABN , First Publish Date - 2021-05-30T06:02:34+05:30 IST

మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం వద్ద శనివారం అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎమ్మిగనూరుకు చెందిన ఆటోలో నాగలదిన్నెకు చెందిన ఇసుబు(54)తో పాటు మరో ఐదుగురు మంత్రాలయం వస్తున్నారు.

అదుపుతప్పి ఆటో బోల్తా

  1. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు


మంత్రాలయం, మే 29. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం వద్ద శనివారం అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎమ్మిగనూరుకు చెందిన ఆటోలో నాగలదిన్నెకు చెందిన ఇసుబు(54)తో పాటు మరో ఐదుగురు మంత్రాలయం వస్తున్నారు. డ్రైవర్‌ మద్యం సేవించి ఆటో నడుపుతున్నందు వల్ల చిలకలడోణ వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇసుబు అక్కడిక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న సూరన్న, ఆరుణమ్మలతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. వారిని  ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇసుబు మృతాదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎమ్మిగనూరుకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎర్రన్న పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-30T06:02:34+05:30 IST