మహిళపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2021-06-23T05:03:29+05:30 IST

మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది.

మహిళపై అత్యాచారయత్నం

  1. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన బంధువులు 


కోవెలకుంట్ల, జూన్‌ 22: మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఓ గ్రామంలో మహిళ జమ్ముగడ్డి కోసుకరావడానికి వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి ఆమెపై అత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకొని కొద్ది దూరంలో ఉన్న కుటుంబసభ్యులకు, గ్రామస్థులకు తెలియజేసింది. వారు వచ్చి నిందితుడ్ని కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-06-23T05:03:29+05:30 IST