వ్యక్తిపై దాడి

ABN , First Publish Date - 2021-08-21T04:58:19+05:30 IST

మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మూలె ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన గుత్తి మల్లిఖార్జున, గుత్తి మద్దిలేటి, గుత్తి శివ, మల్లయ్యగారి మునిస్వామి అనే నలుగురు వ్యక్తులు శుక్రవారం దాడి చేశారని హెడ్‌కానిస్టేబుల్‌ నరసింహులు తెలిపారు.

వ్యక్తిపై దాడి

కొలిమిగుండ్ల, ఆగస్టు 20: మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మూలె ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన గుత్తి మల్లిఖార్జున, గుత్తి మద్దిలేటి, గుత్తి శివ, మల్లయ్యగారి మునిస్వామి అనే నలుగురు వ్యక్తులు శుక్రవారం దాడి చేశారని హెడ్‌కానిస్టేబుల్‌ నరసింహులు తెలిపారు. మూలె ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గని నుంచి ఇంటికి వెళ్తుండగా పశువుల ఆస్పత్రి దగ్గర గుత్తి మల్లిఖార్జునతో పాటు మరో ముగ్గురు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని అడ్డగించి మా వైపు కోపంగా చూస్తావా అంటూ వాగ్వావాదం పెట్టుకొని రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.   


Updated Date - 2021-08-21T04:58:19+05:30 IST