నాటుసారా విక్రేతల అరెస్టు

ABN , First Publish Date - 2021-05-13T05:57:26+05:30 IST

అక్రమ నాటుసారాను స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తిమ్మారెడ్డి బుధవారం తెలిపారు.

నాటుసారా విక్రేతల అరెస్టు

సంజామల, మే 12: అక్రమ  నాటుసారాను స్వాధీనం చేసుకొని,    ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తిమ్మారెడ్డి బుధవారం తెలిపారు. ఆకుమళ్ల గ్రామానికి చెందిన నాసారి శ్రీనివాసులు గ్రామంలోని చౌడమ్మ దేవాలయం వద్ద నాటుసారా విక్రయిస్తుండగా సిబ్బందితో దాడులు నిర్వహించి అతడ్ని అదుపులోకి తీసుకొని 5 లీటర్ల నాటుసారాను స్వాఽధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోవెలకుంట్ల మండలం క్రిష్టిపాడుకు చెందిన షరీఫ్‌, శీలం వెంకటేశ్వర్లు 15 లీటర్ల నాటుసారా తీసుకెళ్తుండగా సంజామల రైల్వే బ్రిడ్జి వద్ద వారిని అదుపులోకి తీసుకొని వారి మోటారుసైకిల్‌, 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ ముగ్గురిని రిమాండుకు తరలించినట్లు ఎస్‌ఐ వివరించారు.  

Updated Date - 2021-05-13T05:57:26+05:30 IST