‘యాప్‌లను రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2021-11-01T05:28:24+05:30 IST

బోధనను దూరం చేస్తున్న యాప్‌లను ప్రభుత్వం రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు నాగరాజు ఆదివారం పత్రిక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

‘యాప్‌లను రద్దు చేయాలి’

ఆలూరు, అక్టోబరు 31: బోధనను దూరం చేస్తున్న యాప్‌లను ప్రభుత్వం రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు నాగరాజు ఆదివారం పత్రిక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. యాప్‌లను రద్దు చేయకపోతే బహిష్కరించాలని రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్‌ నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 8 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులు పీఆర్‌సీ ప్రకటనపై ప్రభుత్వ జాప్యాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 వేల ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందిగానీ, ఆ దిశగా చర్యలు తీసుకోలేదని అన్నారు. సీపీఎస్‌ రద్దు, బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలనే డిమాండ్లతో నవంబరు 6న డీఈవో కార్యాలయాల వద్ద నిరసన,  19న చలో అసెంబ్లీ కార్యక్రమాలను తలపెట్టినట్లు తెలిపారు.

Updated Date - 2021-11-01T05:28:24+05:30 IST