‘సబ్సిడీ విత్తనాలకు దరఖాస్తు చేసుకోండి’

ABN , First Publish Date - 2021-05-09T05:07:47+05:30 IST

ఖరీఫ్‌లో సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలను అందిస్తుందని, రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఏవో శివశంకర్‌ తెలిపారు.

‘సబ్సిడీ విత్తనాలకు దరఖాస్తు చేసుకోండి’

మంత్రాలయం, మే 8: ఖరీఫ్‌లో సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలను అందిస్తుందని, రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఏవో శివశంకర్‌ తెలిపారు. శనివారం మండలంలోని కగ్గల్‌ గ్రామంలోని రైతు భరోస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీ ద్వార విత్తనాలు మంజూరు చేసిందన్నారు. దేంచా రకానికి చెందిన విత్తనాలను 50 శాతం సబ్సిడీతో రూ. 2900లకు, సన్‌హెంప్‌ రకం విత్తనాలు 50 శాతం సబ్సిడితో రూ. 3750లకు, ఢిల్లీ పెసర విత్తనాలు 50 శాతం సబ్సిడీతో రూ. 4250కు వేరుశెనగ 40 శాతం సబ్సిడీతో 5208లకు అందిస్తుందని తెలిపారు. వీఏఏ శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:07:47+05:30 IST