‘మహిళలకు రక్షణ ఏదీ?’

ABN , First Publish Date - 2021-08-22T04:44:00+05:30 IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని టీడీపీ మైనార్టీ నాయకుడు గడ్డం ఫకృద్దీన్‌ అన్నారు.

‘మహిళలకు రక్షణ ఏదీ?’

ఆదోని టౌన్‌, ఆగస్టు 21: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని టీడీపీ మైనార్టీ నాయకుడు గడ్డం ఫకృద్దీన్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ మహిళలపై వరుసగా అఘాయి త్యాలు జరుతున్నాయని, నడి రోడ్లపై కత్తి పోట్లు, యాసిడ్‌ దాడులు జరుగుతున్నా నిందితులను పట్టుకోవడంలో, శిక్షణలు విధించడంలో జరుగుతున్న కాలయాపనతో దాడులు పెరుగుతున్నాయని విమర్శించారు. దిశ యాప్‌ ఉన్నా మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమవడంతో మహిళలు బయటికి స్వేచ్ఛగా రాలేకపో తున్నారన్నారు. నిందితులను పట్టుకోవడంలో వేగం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-08-22T04:44:00+05:30 IST