చంద్రబాబు పటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2021-08-21T05:27:53+05:30 IST

మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చిత్రపటానికి పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేపట్టారు.

చంద్రబాబు పటానికి క్షీరాభిషేకం
చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గౌరుచరిత

కల్లూరు, ఆగస్టు 20: మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చిత్రపటానికి పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేపట్టారు. శుక్రవారం మాధవీనగర్‌లోని తన స్వగృహంలో పూలమాలలు వేసి మాజీ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గౌరు చరిత మాట్లాడుతూ 2014 ఆగస్టు 20న బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు అపూర్వ గౌరవం ఇచ్చారన్నారు. బ్రాహ్మణుల కలను సాకారం చేసిన మహానేత చంద్రబాబు నాయుడు అని, ఆయన ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు చేసిన సేవలను గూర్చి వివరించారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత గుర్తింపు లేదని అన్నారు. ఆర్‌బీఎస్‌ నాయకులు ఎస్‌కే శ్రీనివాసులు, దేవీప్రసాద్‌, రాఘవేంద్రరావు, గోవర్ధన్‌, పద్మనాభరావు, గురురాజ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T05:27:53+05:30 IST