వైసీపీ దాడులపై ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-20T05:24:48+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేయడం సిగ్గు చేటు అని, అప్రజాస్వామికమ ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ధర్మవరం సుబ్బారెడ్డి, వలసల రామకృష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధికార ప్రతినిధి విజయభట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ దాడులపై ఆగ్రహం
డోన్‌: మాట్లాడుతున్న నాయకులు

డోన్‌, అక్టోబరు 19: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేయడం సిగ్గు చేటు అని, అప్రజాస్వామికమ ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ధర్మవరం సుబ్బారెడ్డి, వలసల రామకృష్ణ, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు, పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధికార ప్రతినిధి విజయభట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి డోన్‌ పట్టణంలో వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తే దాడులు చేస్తూ అరాచకానికి దిగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతోందన్నారు. వైసీపీ చేస్తున్న దాదాగిరిని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడులు చేశారని, ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై, తమ పార్టీ నాయకుల నివాసాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదన్నది వైసీపీ గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ దాడులకు ఎవరూ భయపడరని అన్నారు. చంద్రబాబు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తే.. వైసీపీ ప్రభుత్వం అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మార్చిందని టీడీపీ నాయకులు మండిపడ్డారు.


 వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్నంతా మాఫీయాగా మార్చిందని, మాఫియా పాలనను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులను టార్గెట్‌ చేసి వైసీపీ చేస్తున్న దాడులపై ప్రజలే తిరగబడే రోజులు వస్తాయని టీడీపీ డోన్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, తెలుగుమహిళ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ కార్యదర్శి భారతి, సుధీష్‌ మండిపడ్డారు. మంగళవారం రాత్రి డోన్‌లో వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన పోరాడుతూ మాఫియా పాలనను ప్రశ్నిస్తున్న టీడీపీ నేత పట్టాభి నివాసంపై వైసీపీకి చెందిన గంజాయి మాఫియా దాడులు చేయడం దారుణమన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే వైసీపీ దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మంట గలుపుతోందని అన్నారు.


ప్యాపిలి: టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని టీడీపీ నాయకుల ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేయడం అప్రజాస్వామికమని టీడీపీ నాయకులు గండికోట రామసుబ్బయ్య, అలేబాదు పరమేష్‌, రామ్మోహన్‌ యాదవ్‌, నాగేంద్ర అన్నారు. ప్యాపిలిలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. గంజాయి సాగుపై టీడీపీ నాయకులు వాస్తవాలు మాట్లాడినందుకు జీర్ణించుకోలేని వైసీపీ దాడులకు అన్నారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని మరోసారి బహిర్గమైందని అన్నారు. దాడులకు దిగిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.


క్రిష్ణగిరి: టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ కార్యనిర్వహక కార్యదర్శి ఆలంకొండ నబీసాహెబ్‌, మండల అధ్యక్షుడు కటారుకొండ మర్రి శ్రీరాములు, తెలుగు యువత మండల నాయకులు బొంతిరాళ్ళ మహమ్మద్‌ రఫి, టీడీపీ లీగల్‌ సెల్‌ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు మాదాపురం ఎల్వీ ప్రసాద్‌ అన్నారు. మంగళవారం వారు మాట్లాడుతు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు. వైసీపీ నాయకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేరోజు దగ్గరలోనే ఉందన్నారు. టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కోరారు.

Updated Date - 2021-10-20T05:24:48+05:30 IST