విద్యార్థుల సస్పెన్షన్‌పై ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-08T05:26:29+05:30 IST

ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా? అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల సస్పెన్షన్‌పై ఆగ్రహం

కర్నూలు (న్యూసిటీ), అక్టోబరు 7: ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా? అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం సుందరయ్య భవన్‌లో యూనివర్సిటీ కార్యదర్శి రామక్రిష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకటేష్‌ మాట్లాడారు. విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సెక్యూరిటీ గార్డులను తొలగించకుండా ఇంజనీరింగ్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేయడం దారుణమన్నారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కార్యదర్శి అబ్దుల్లా, సాయిఉదయ్‌, తిమ్మప్ప, మధు పాల్గొన్నారు. 


 ఆర్‌యూలో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసులు, కారుమంచి అన్నారు. గురువారం సీఆర్‌ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు శాంతియుతంగా ఆందోళన చేస్తే సమస్యను పరిష్కరించకుండా విద్యార్థులను సస్పెండ్‌ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్గనైజింగ్‌ కార్యదర్శి  పులిశేఖర్‌, బీసన్న, సుధాకర్‌, దేవేంద్ర పాల్గొన్నారు. 


కర్నూలు(అర్బన్‌): యూనివర్సిటీలో సమస్యలపై ప్రశ్నిస్తే బీటెక్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేస్తారా? అని రాయలసీమ విద్యార్థి పరిషత్‌ వ్యవస్థాపకుడు(ఆర్‌వీపీ) సి.మహేంద్ర డిమాండ్‌ చేశారు. గురువారం నగరంలోని ఆ సంఘం కార్యాలయంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ధర్నాలకు వెళ్లరానే నెపంతో సస్పెండ్‌ చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. నాయకులు చిన్న, నాగరాజు, అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.


 రాయలసీమ యూనివర్సిటీ త్వరలో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహిస్తున్నట్లు రాయలసీమ పరిరక్షణ విద్యార్థి ఫెడరేషన్‌(ఆర్‌పీఎస్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షులు ప్రకాష్‌ తెలిపారు. గురువారం నగరంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రజలు, ప్రజాప్రతి నిధులు, విద్యార్థులకు తెలిజేస్తామన్నారు. 


Updated Date - 2021-10-08T05:26:29+05:30 IST