‘వ్యాక్సిన్‌ పంపిణీ బాధ్యత అంగన్‌వాడీ వర్కర్లదే’

ABN , First Publish Date - 2021-06-23T05:12:14+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ బాధ్యత అంగన్‌వాడీ వర్కర్ల దేనని ఐసీడీఎస్‌ పీడీ కె.ప్రవీణ అన్నారు.

‘వ్యాక్సిన్‌ పంపిణీ బాధ్యత అంగన్‌వాడీ వర్కర్లదే’

ఆదోని రూరల్‌, జూన్‌ 22: కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ బాధ్యత అంగన్‌వాడీ వర్కర్ల దేనని ఐసీడీఎస్‌ పీడీ కె.ప్రవీణ అన్నారు. మంగళవారం రూరల్‌ ఐసీడీఎస్‌ కార్యాలయంలో ఐసీడీఎస్‌ సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్‌వాడీ సెంటర్లను దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మ్యాపింగ్‌ చేయాలన్నారు. పాఠశాలలు లేనిపక్షంలో నూతనంగా మరో అంగన్‌ వాడీ సెంటర్‌ను నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలో మొత్తం 2లక్షల 29 వేల మంది తల్లులు వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు 94 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారన్నారు. సమావేశంలో రూరల్‌ సీడీపీవో ఉమామహేశ్వరి, సూపర్‌వైజర్లు సుధావతి, సుమిత్ర, శివలింగమ్మ, అంజినమ్మ, సావిత్రి, లీలా వతి, మీనాక్షమ్మ పాల్గొన్నారు. Updated Date - 2021-06-23T05:12:14+05:30 IST