కరోనాతో అంగన్‌వాడీ కార్యకర్త మృతి

ABN , First Publish Date - 2021-05-30T06:30:08+05:30 IST

చాగలమర్రి గ్రామంలోని న్యూ బిల్డ్సి వీధిలో నివాసం ఉంటున్న అంగన్‌వాడీ కార్యకర్త నీరజ (48) కరోనాతో మృతి చెందినట్లు శనివారం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుశీలమ్మ తెలిపారు.

కరోనాతో అంగన్‌వాడీ కార్యకర్త మృతి

చాగలమర్రి, మే 29: చాగలమర్రి గ్రామంలోని న్యూ బిల్డ్సి వీధిలో నివాసం ఉంటున్న అంగన్‌వాడీ కార్యకర్త నీరజ (48) కరోనాతో మృతి చెందినట్లు శనివారం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుశీలమ్మ తెలిపారు. పది రోజుల క్రితం తన భర్తకు పాజిటివ్‌ రావడంతో చికిత్స నిమిత్తం కర్నూలు వైద్యశాలకు నీరజ వెళ్లినట్లు తెలిపారు. వైద్యశాలలో ఉన్న నీరజకు పాజిటివ్‌ రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆమె మృతి పట్ల ఆళ్లగడ్డ సీడీపీవో జోత్స్న, మండల అంగన్‌వాడీ వర్కర్ల అధ్యక్షురాలు సుగుణ, ప్రధాన కార్యదర్శి చంద్రకళ, అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు సంతాపం ప్రకటించారు.

Updated Date - 2021-05-30T06:30:08+05:30 IST