రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-07T05:47:13+05:30 IST

నంద్యాల నూనెపల్లె సమీపంలో రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

నంద్యాల(నూనెపల్లె), డిసెంబరు 6: నంద్యాల నూనెపల్లె సమీపంలో రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ట్రాక్‌పై వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. శవపరీక్ష నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రి మారురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. 


Updated Date - 2021-12-07T05:47:13+05:30 IST