ఎస్సార్బీసీలో పడి వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-12-08T05:53:54+05:30 IST

బనగానపల్లె పట్టణ శివారులోని ఎస్సార్బీసీ కాల్వలో పడి గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్‌ఐకృష్ణమూర్తి మంగళవారం తెలిపారు.

ఎస్సార్బీసీలో పడి వృద్ధురాలి మృతి

బనగానపల్లె, డిసెంబరు 7: బనగానపల్లె పట్టణ శివారులోని ఎస్సార్బీసీ కాల్వలో పడి గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్‌ఐకృష్ణమూర్తి మంగళవారం తెలిపారు. సుమారు 65 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధురాలి ఎస్సార్బీసీ కాల్వలో కాలుజారిపడి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె వైద్యశాలలో ఉంచినట్లు తెలిపారు. ఆమె ఎర్రచీర, పసుపురంగు రవిక ధరించి ఉందన్నారు. వివరాలు తెలిసివారు బనగానపల్లె పోలీ్‌సస్టేషన్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు. 



Updated Date - 2021-12-08T05:53:54+05:30 IST