నాటక ప్రదర్శనలకు ఆడిటోరియం నిర్మించాలి

ABN , First Publish Date - 2021-12-31T05:05:33+05:30 IST

పాతబస్టాండులోని మున్సిపల్‌ ఓపెన ఎయిర్‌ ఆడిటోరియాన్ని తొలగించి షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మిస్తున్న తరుణంలో తమకు ప్రత్యామ్నాయ ఆడిటోరియం నిర్మించి ఇవ్వాలని సీనియర్‌ రంగస్థల కళాకారుడు, విశ్వ కళాసమితి నాటక సంస్థ అధ్యక్షుడు గాండ్ల లక్ష్మన్న పేర్కొన్నారు.

నాటక ప్రదర్శనలకు ఆడిటోరియం నిర్మించాలి


కర్నూలు (కల్చరల్‌), డిసెంబరు 30: పాతబస్టాండులోని మున్సిపల్‌ ఓపెన ఎయిర్‌ ఆడిటోరియాన్ని తొలగించి షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మిస్తున్న తరుణంలో తమకు ప్రత్యామ్నాయ ఆడిటోరియం నిర్మించి ఇవ్వాలని సీనియర్‌ రంగస్థల కళాకారుడు, విశ్వ కళాసమితి నాటక సంస్థ అధ్యక్షుడు గాండ్ల లక్ష్మన్న పేర్కొన్నారు. పలువురు కళాకారులు గురువారం నగర మేయర్‌ బీవై రామయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాండ్ల లక్ష్మన్న మాట్లాడుతూ పేద వర్గాలకు చెందిన కళాకారులకు అందుబాటులో ఉన్న ఏకైక ఆడిటోరియం ఇదేనని, ఇతర ప్రైవేటు ఆడిటోరియాలలో నాటక ప్రదర్శనలకు ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయని తెలిపారు.   మేయర్‌ స్పందిస్తూ కళాకారులకు ప్రత్యామ్నాయంగా ఆడిటోరియం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో కర్నూలు కళాకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వీవీ రమణారెడ్డి, టి. రాజశేఖర్‌రావు, హనమాన  కళాసమితి అధ్యక్షుడు పి. హనుమంతరావు చౌదరి, కళావాహిని సంస్థ అధ్యక్షుడు మనోహర్‌బాబు, రంగస్థల నటీ ఎంఆర్‌ రాధిక పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T05:05:33+05:30 IST