ఆళ్వారుల చరిత్ర-ప్రభంధం పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2021-11-01T05:17:01+05:30 IST

నంద్యాల నేషనల్‌ పీజీ కళాశాలలో చిన్నయసూరి సాహితీ సమితి ఆధ్వర్యంలో డాక్టర్‌ వెంకటరమణమూర్తి రచించిన ‘‘ఆళ్వారుల చరిత్ర-ప్రభంధం’’ పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు.

ఆళ్వారుల చరిత్ర-ప్రభంధం పుస్తకావిష్కరణ

నంద్యాల (కల్చరల్‌), అక్టోబరు 31: నంద్యాల నేషనల్‌ పీజీ కళాశాలలో చిన్నయసూరి సాహితీ సమితి ఆధ్వర్యంలో డాక్టర్‌ వెంకటరమణమూర్తి రచించిన ‘‘ఆళ్వారుల చరిత్ర-ప్రభంధం’’ పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. నేషనల్‌ విద్యాసంస్ధల అధినేత డాక్టర్‌ ఇంతియాజ్‌ అహమ్మద్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఆళ్వారుల చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక సమీక్షకులుగా చక్రాల లక్ష్మీకాంత రాజారావు, కిళాంబి వేణుగోపాలచార్యులు, అష్టావధాని అవధానం సుదాకరశర్మ, శతావధాని ఆముదాల మురళిలు వ్యవహరించారు. ఇదే సభలో గంగుల నాగరాజు రచించిన శ్రీరమణీయం, వీపూరి వెంకటేశ్వర్లు రచించిన భజగోవిందం పుస్తకాలను ఆవిష్కరించారు. డాక్టర్‌ రమణమూర్తి తండ్రి శేషయ్య పేరటి సాహితీ పురష్కారాలు అందజేశారు. అనంతరం శిష్యబృందం, శ్రేయోభిలాషుల చేత డాక్టర్‌ రమణమూర్తికి ఘనంగా కన్నులపండువగా గండపెండేరం సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో కవులు రచయతలు అన్నెం శ్రీనివాసరెడ్డి, శేషఫణి, మాబుబాషా, కవయుత్రి లీలావతి, డండబోయున పార్వతి దేవి, నీలకంఠమాచారి, సాహితీ ప్రియులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-01T05:17:01+05:30 IST